నా కొరకై అన్నియు చేసెను
Naa Korakai Anniyu Chaesenu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 12/31/2016
Lyrics
నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో నా కొరకై అన్నియు చేసినందులకు నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2) ||నా కొరకై|| క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ క్షామం తీరే వరకు ఆ విధవరాలి ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2) ||నా కొరకై|| ఆకాశ పక్షులను గమనించుడి విత్తవు అవి పంట కోయవు వాటిని పోషించునట్టి పరమ పితా మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును (2) ||నా కొరకై|| ఏమి ధరింతుమని చింతపడకు అడవి పువ్వులను తేరి చూడుము అడవి పువ్వుల ప్రభు అలంకరింప తానె – నిశ్చయముగా అలంకరించును (2) ||నా కొరకై|| రేపటి దినము గూర్చి చింత పడకు ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు రేపు దాని సంగతులనదే చింతించున్ ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2) ||నా కొరకై|| ఆశీర్వదించెడి యేసు అరణ్యములో పోషించెను ఐదు వేల మందిని కూడా తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై (2) ||నా కొరకై||