నా మార్గమందు
Naa Maargammdu
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 1/1/2023
Lyrics
నా మార్గమందు నా కంటె ముందు నడిచావయ్యా నా యేసయ్యా పరలోకమందు నేనుండాలని ఒక స్థలమును సిద్ధపరిచావయ్యా నిందలు అవమానములెన్నో సహియించి – సహియించి సిలువలో నా శాపములన్ని భరియించి – భరియించి అడ్డుగా ఉన్న పాపములన్ని క్షమియించి – క్షమియించి మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి… (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు నన్ను… నీ సాక్షిగా నిలిపినావు నీ ప్రేమను – ప్రకటించుటకు నీ చిత్తము – నెరవేర్చుటకు నీ సేవలో – కొనసాగుటకు నీ మహిమలో – నేనుండుటకు (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు నన్ను… నీ సాక్షిగా నిలిపినావు నా యేసయ్యా – నీ సాక్షిగా నిలిపినావు –