నా నాథుడా

Naa Naathhudaa

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 10/24/2015

Lyrics

నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు
అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని
పెన్నుగ నాలో నాటుమా
ప్రేమన్
||నా నాథుడా||
దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్
యావత్తు పెంటయనుచు
నిదిగో
||నా నాథుడా||
ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా
ఆశ కల్గించు నాలోన
నీవే
||నా నాథుడా||
పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా
కరుణతో నన్ను గావుమా
యిప్పుడు
||నా నాథుడా||
భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి
పాతకుడ నేనైతిని
మహా
||నా నాథుడా||
ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ
సదయుడా నన్ను చూడుమా
యిపుడు
||నా నాథుడా||
హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను
ఉల్లమందానంద ధ్వని
యిదియే
||నా నాథుడా||

Video