నా నోటన్ క్రొత్త పాట
Naa Notan Kroththa Paata
UncategorizedAdded on 6/20/2017
Lyrics
నా యేసు ఇచ్చెను ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా హల్లెలూయా ||నా నోటన్|| అంధకార పాపమంత నన్ను చుట్టగా దేవుడే నా వెలుగై ఆదరించెను (2) ||ఆనందించెదను|| దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెను రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను (2) ||ఆనందించెదను|| నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే నిందలోర్చి ఆయనను ప్రకటింతును (2) ||ఆనందించెదను|| వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను (2) ||ఆనందించెదను|| భువిలోని బాధలు నన్నేమి చేయును పరలోక దీవెనకై వేచియున్నాను (2) ||ఆనందించెదను||