నా ఊహకందని ప్రేమతో

Naa Oohakmdani Praematho

UncategorizedAdded on 8/25/2018

Lyrics

ఆ ప్రేమలోనే నన్ను నీలోనే నిలిపావు
నాలోన నీవున్నావు – నీలోన నను దాచావు
నీ సాక్షిగా నను నిలిపావు
(2)          ||నా ఊహకందని||
అందరు నన్ను చూచి నీ బ్రతుకు మారదని
దూరాన నిలచి నన్ను చూచి నవ్వారే
ఏనాడు అనుకోలేదు
నన్ను నీవు ఎన్నుకుంటావని
(2)          ||నా ఊహకందని||
జీవితమంతా శూన్యమైపోగా
నాకున్న వారే నన్ను విడచిపోగా
ఏనాడు అనుకోలేదు
నాకు తోడుగా నీవుంటావని
(2)          ||నా ఊహకందని||
నా జీవితాన్ని నీవు మార్చినావు
నీ సేవలోనే నన్ను నిల్పినావు
ఏనాడు అనుకోలేదు
నా జీవితం ఇలా మారుతుందని
(2)          ||నా ఊహకందని||