నా ప్రాణమా ఏలనే
Naa Praanamaa Aelanae
Lyricistఆర్ మధు
UncategorizedAdded on 5/12/2017
Lyrics
నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు నెమరేసుకుంటూ ప్రాణమా స్తుతిపాడుమా – స్తుతిపాడుమా ||నా ప్రాణమా|| నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు నీ కొరకు సిలువలోన తాను మరణించాడు నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా నీవు కూడా తన కార్యం పాటించుమా అలనాటి యేసు ప్రేమ మరువకు సుమా మరువకు సుమా – మరువకు సుమా ||నా ప్రాణమా|| నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడు నీ వ్యాధి బాధలందు నిన్ను ఓదార్చాడు నా ప్రాణమా నాలో కరిగిపోకే నీ గతం ఏమిటో మరచిపోకే దినమెల్ల దేవుని దయ కోరుమా దయ కోరుమా – దయ కోరుమా ||నా ప్రాణమా|| నీ చదువులోన నీకు విజయాన్ని ఇచ్చాడు నీ వయసులో నీకు తోడుగా ఉన్నాడు నా ప్రాణమా నాలో కృంగిపోకే నీ గతం ఏమిటో మరచిపోకే దినమెల్ల దేవుని కృప కోరుమా కృప కోరుమా – కృప కోరుమా ||నా ప్రాణమా||