నా ప్రాణమా నాలో నీవు
Naa Praanamaa Naalo Neevu
Lyricistఎం ఎస్ శాంతవర్ధన్
UncategorizedAdded on 10/13/2015
Lyrics
నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు (2) ||నా ప్రాణమా|| ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ నీ కొరకే బలియైన యేసు సిలువను గూర్చి తలపోయుమా అల్పకాల శ్రమల పిదప మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) ||నా ప్రాణమా|| ఆప్తులంతా నిను వీడిననూ శత్రువులే నీపై లేచిననూ తల్లి అయినా మరచినా మరచున్ నేను నిన్ను మరువాననినా యేసుని ప్రేమన్ తలపోయుమా ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) ||నా ప్రాణమా|| ఐశ్వర్యమే లేకున్ననూ సౌఖ్య జీవితమే కరువైననూ ప్రభు సేవలో ప్రాణములనే అర్పించవలసి వచ్చిననూ క్రీస్తునికే అంకితమై ఆనందించు ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||