నా ప్రాణప్రియుడా నా యేసురాజా
Naa Praanapriyudaa Naa Yaesuraajaa
Lyricistవిక్టర్ రాంపోగు
UncategorizedAdded on 7/14/2016
Lyrics
నా ప్రాణప్రియుడా నా యేసురాజా నా యేలినవాడా నా స్నేహితుడా నిన్ను చేరాలని నీతో ఉండాలని నిన్ను వలచానయ్యా – నీవు నా సొంతం (2) ||నా ప్రాణ|| నీ స్వరము నే వింటిని – ప్రాణం సొమ్మసిల్లెనేసయ్యా నీ ముఖము నే చూచితిని – మనసానందమాయేనా నీ ప్రేమను రుచి చూచితి నీ వశమైతిని యేసయ్యా (2) ||నా ప్రాణ|| నీ చేయి నే పట్టుకొని – నీతో నడవాలనుంది యేసయ్యా నీ భుజమును నేనానుకొని – నీతో బ్రతకాలనుంది యేసయ్యా నిన్ను హత్తుకొని నీ ఒడిలోన నిదురించాలని ఉందయ్యా (2) ||నా ప్రాణ||