నా ప్రియమైన యేసు ప్రభు

Naa Priyamaina Yaesu Prabhu

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 7/23/2017

Lyrics

నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు
||నా ప్రియమైన||
ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని
దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని
(2)        ||నా ప్రియమైన||
ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం
నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై
(2)        ||నా ప్రియమైన||
లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని
శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై
(2)        ||నా ప్రియమైన||
ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు
ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము
(2)        ||నా ప్రియమైన||
మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును
నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి
(2)        ||నా ప్రియమైన||

Video