నా సంకట దుఃఖములెల్ల
Naa Smkata Duhkhamulella
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 5/8/2016
Lyrics
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా నశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2) ||నా సంకట|| విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2) ||నా సంకట|| ఇంకా నేను ఫరోకు దాసుడను కాను ఇంకా నేను సీయోను కన్యుడను గాను (2) ||నా సంకట|| మార్చబడు నాడు మారా మధురముగా పారు జలము బండనుండి త్రాగుచుండును (2) ||నా సంకట|| సౌందర్యమయమగు పరమ కానాను నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు (2) ||నా సంకట|| ఆనందమే పరమానందమే కానాను జీవితము నా కానందమే (2) ||నా సంకట|| నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును (2) ||నా సంకట|| నా యేసు ప్రభువే నా బలము గానము నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా (2) ||నా సంకట||