నా స్నేహితుడా
Naa Snaehithudaa
Lyricistడేవిడ్సన్ గాజులవర్తి
UncategorizedAdded on 10/15/2017
Lyrics
నీతో స్నేహం నే మరువగలనా నిన్ను విడచి నేను ఉండగలనా నీతో స్నేహం నే మరువగలనా నా స్నేహితుడా… నా యేసయ్యా విడువక నను ఎడబాయని నేస్తమా ||నీతో|| నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగా శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా శత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగా లోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగా కన్నీరు తుడిచే నా నేస్తం నీవేగా ఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా|| నా తోడుగా నీవుండగా – కొదువేమి లేదుగా కష్టములైనా నష్టములైనా – తడబడిపోనుగా అపాయమేమి రాకుండగా – కాచేవాడవు నీవేగా ఎన్నటికైనా మారని నీదు – స్నేహమే మధురముగా ప్రేమను పంచిన నా నేస్తం నీవేగా ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా||