నా స్తుతి పాత్రుడా

Naa Sthuthi Paathrudaa

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 7/26/2016

Lyrics

నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా
నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా
నీ వాక్యమే నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము
నీ వాక్యమే నా పాదములకు దీపము
(3)    ||నా స్తుతి పాత్రుడా||
నీ కృపయే నా ఆశ్రయము
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము
నీ కృపయే నా జీవన ఆధారము
(3)    ||నా స్తుతి పాత్రుడా||
నీ సౌందర్యము యెరూషలేము
నీ పరిపూర్ణత సీయోను శిఖరము
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము
(3)    ||నా స్తుతి పాత్రుడా||

Video