నా యేసయ్య ప్రేమ
Naa Yaesayya Praema
Lyricistజ్యోతి మనోహర్
UncategorizedAdded on 9/3/2018
Lyrics
నా యేసయ్య ప్రేమ నా తండ్రి గొప్ప ప్రేమ వర్ణించగలనా నా మాటతో నే పాడగలనా క్రొత్త పాటతో (2) ||నా యేసయ్య|| నా పాపనిమిత్తమై సిలువనూ తానే మోసే ఈ ఘోర పాపి కొరకై తన ప్రాణము అర్పించెనే ఏముంది నాలో దేవా ఏ మంచి లేనే లేదే (2) ||నా యేసయ్య|| తప్పి పోయిన నన్ను వెదకి రక్షించితివే ఏ దారి లేక ఉన్నా నీ దరికి చేర్చితివే ఏముంది నాలో దేవా ఏ మంచి లేనే లేదే (2) ||నా యేసయ్య||