నా యేసయ్యా నా స్తుతియాగము

Naa Yaesayyaa Naa Sthuthiyaagamu

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 8/2/2017

Lyrics

నా యేసయ్యా నా స్తుతియాగము
నైవేద్యమునై ధూపము వోలె
నీ సన్నిధానము చేరును నిత్యము
చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే
ఆత్మతోను మనసుతోను
నేను చేయు విన్నపములు
ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై
విజ్ఞాపన చేయుచున్నావా
విజ్ఞాపన చేయుచున్నావా
||నా యేసయ్యా||
ప్రార్థన చేసి యాచించగానే
నీ బాహు బలము చూపించినావు
మరణపు ముల్లును విరిచితివా నాకై
మరణ భయము తొలగించితివా
మరణ భయము తొలగించితివా
||నా యేసయ్యా||
మెలకువ కలిగి ప్రార్థన చేసిన
శోధనలన్నియు తప్పించెదవు
నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై
రారాజుగా దిగి వచ్చెదవు
రారాజుగా దిగి వచ్చెదవు
||నా యేసయ్యా||

Video