నా యెడల నీకున్న

Naa Yedala Neekunna

Lyricistఆడమ్ బెన్నీ
UncategorizedAdded on 1/3/2016

Lyrics

నా యెడల నీకున్న తలంపులన్ని
ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య
అవి రమ్యమైనవి అమూల్యమైనవి
నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య
నాకై నీవు తలంచుచున్నావా
(2)          ||నా యెడల||
రాజువైన నీవు దాసుడవయ్యావా
దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే
అభిషేకించావు అధికారం ఇచ్చావు
పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు
నీకే స్తోత్రము యేసయ్య
(2)          ||నా యెడల||
ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా
దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే
ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు
సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు
నీకే స్తోత్రము యేసయ్య
(2)          ||నా యెడల||
బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా
బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే
నా స్తానము నిలిచావు నా శిక్ష భరించావు
నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు
నీకే స్తోత్రము యేసయ్య
(2)          ||నా యెడల||

Video