నాకెంతో ఆనందం

Naakemtho Aanmdm

UncategorizedAdded on 3/30/2023

Lyrics

నీలో నేనుండుటే అదే నా ధన్యతయే
నాకెంతో ఆనందం…
ఏ అపాయము నను సమీపించక
ఏ రోగమైనను నా దరికి చేరక
నీవు నడువు మార్గములో నా పాదము జారక
నీ దూతలే నన్ను కాపాడితిరా
(2)          ||నాకెంతో||
నా వేదనలో నిన్ను వేడుకొంటిని
నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని
నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
నా కన్న తండ్రివై కాపాడుచుంటివా
(2)          ||నాకెంతో||
నూతన యెరూషలేం నా గమ్యమేనని
నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా
నీవుండు స్థలములో నేనుండ గోరెదను
నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా
(2)          ||నాకెంతో||

Video