నాకు చాలిన దేవుడ నీవు
Naaku Chaalina Daevuda Neevu
UncategorizedAdded on 8/26/2017
Lyrics
నా కోసమే మరణించావు నా శ్రమలలో నా ఆధారమా నను ఎడబాయని నా దైవమా ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను ఏ రీతిగా నిను స్తుతియించగలను (2) ||నాకు చాలిన|| వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలె మౌనివై నా పాప శిక్షణోర్చినావు అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా (2) ||ఏమిచ్చి|| ఎండిన భూమిలో లేత మొక్క వోలె నా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో నడవలేక సుడి వడి కూలినావయ్యా (2) ||ఏమిచ్చి||