నాకున్నది నీవేనని
Naakunnadi Neevaenani
UncategorizedAdded on 6/1/2021
Lyrics
పండు ప్రేమ్ కుమార్ నాకున్నది నీవేనని నను కన్నది సిలువేనని నీవున్నది నాలోనని నేనున్నది నీకేనని సాక్ష్యమిచ్చెద యేసయ్యా నీ సాక్షిగా బ్రతికించుమయ్యా ||నాకున్నది|| గుడ్డివాడను నేనేనని నీ చూపు ప్రసాదించేవని చెవిటి వాడను నేనేనని నీ వినికిడి నేర్పించేవని ||సాక్ష్యమిచ్చెద|| మూగవాడను నేనేనని నీ మాటలు పలికించేవని అవిటివాడను నేనేనని నీ నడకలు నేర్పించేవని ||సాక్ష్యమిచ్చెద||