నాతో నీవు మాటాడినచో

Naatho Neevu Maataadinacho

Lyricistచట్ల దేవసహాయం
UncategorizedAdded on 9/21/2017

Lyrics

నాతో నీవు మాటాడినచో
నే బ్రతికెదను ప్రభు
నా ప్రియుడా నా హితుడా
నా ప్రాణ నాథుడా నా రక్షకా
||నాతో||
యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి
చూడరాని దృశ్యం కనుల గాంచినాను
బుద్ధి మీరినాను హద్దు మీరినాను
లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం
ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రభు
||నాతో||
కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను
వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము
గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటి
దిక్కు లేక నేను దయను కోరుచుంటి
ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రభు
||నాతో||

Video