నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్
Naatho Neevu Maatlaadinacho Naenu Brathikedan
Lyricistలూయిస్ రాజ్
UncategorizedAdded on 9/21/2017
Lyrics
నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ నీ ప్రేమలోతు చవిచూపించు నిన్నే సేవించెదన్ నీ ప్రేమనుండి నన్నెవ్వరు వేరుచేయరూ నీ ప్రేమయందే నేను సంతసించెదన్ యేసయ్యా నీవే నా ఆధారం శ్రమయైనా బాధయైనా వ్యధయైనా ధుఖఃమైనా కరువైనా ఖడ్గమైనా హింసయైనా యేదైనా క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్ యేసయ్యా నీవే నా ఆధారం జీవమైనా మరణమైనా దూతలైనా ప్రధానులైనా ఉన్నవియైనా రాబోవునవైనా యెత్తైనా లోతైనా క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్ యేసయ్యా నీవే నా ఆధారం (4) ||నాతో నీవు||