నావన్ని యంగీకరించుమీ
Naavanni Ymgeekarimchumee
Lyricistపులిపాక జగన్నాథము
UncategorizedAdded on 9/27/2016
Lyrics
నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ నావన్ని కృపచేత నీవలన నొందిన భావంబునను నేను బహుదైర్యమొందెద ||నావన్ని|| నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని|| సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని నిత్యంబు గరముల నీ సేవ జేసెద ||నావన్ని|| నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు ఆశచే నడిపించు మరల నా పదములు ||నావన్ని|| పెదవులతో నేను బెంపుగ నీ వార్త గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి ||నావన్ని|| నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ యావంత యైనను నాశింప మదిలోన ||నావన్ని|| నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు ||నావన్ని|| చిత్తము నీ కృపా యత్తంబు గావించి మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము ||నావన్ని|| హృదయంబు నీకిత్తు సదనంబు గావించి పదిలంబుగా దాని బట్టి కాపాడుము ||నావన్ని||