నడిపిస్తాడు నా దేవుడు

Nadipisthaadu Naa Daevudu

Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 9/27/2016

Lyrics

నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు
అడుగులు తడబడినా – అలసట పైబడినా
చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి
(2)         ||నడిపిస్తాడు||
అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు
(2)        ||నడిపిస్తాడు||
కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు
(2)        ||నడిపిస్తాడు||
నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు
(2)        ||నడిపిస్తాడు||

Video