నే స్తుతించెదను
Nae Sthuthimchedanu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 12/29/2021
Lyrics
నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను ||నే స్తుతించెదను|| ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింప నెవ్వరికి తరమౌనా? పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమనపారముగా (2) ||నే స్తుతించెదను|| పాపములన్నియు బాపుటకై శాపములన్నియు మాపుటకై ఏ పాపమెరుగని ఆ పావనుడు శాపగ్రాహియై చావొందెను (2) ||నే స్తుతించెదను|| శోధన కాలముల యందున వేదన కాలముల యందున నాధుడు యేసు మనతోడనుండ అంతమేగా మన చింతలకు (2) ||నే స్తుతించెదను|| ఎనలేని ప్రేమతో కౌగిలించెను ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను మహామహుండు మహిమ ప్రధానుడు మహిమతో వచ్చును మేఘముపై (2) ||నే స్తుతించెదను|| రాజాధిరాజు ప్రభు యేసే దేవాదిదేవుడు మన యేసే పరమందు దూతలు యిహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా (2) ||నే స్తుతించెదను||