నే యేసుని వెంబడింతునని
Nae Yaesuni Vembadimthunani
UncategorizedAdded on 2/17/2018
Lyrics
నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని|| నా ముందు శిలువ నా వెనుక లోకాశల్ నాదే దారి నా మనస్సులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని ||నే యేసుని|| కరువులైనను కలతలైనను కలసిరాని కలిమి లేములు కలవరంబులు కలిగిననూ కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము ||నే యేసుని|| శ్రమయైననూ బాధలైననూ హింసయైన వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన నా యేసుని ప్రేమనుండి నను యెడబాపెటి వారెవరు ||నే యేసుని||