నేడో రేపో నా ప్రియుడేసు
Naedo Raepo Naa Priyudaesu
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 11/5/2013
Lyrics
నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలమీద ఏతెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు మహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో|| చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతినీయడు నక్షత్రములు రాలిపోవును ఆకాశ శక్తులు కదిలిపోవును ||నేడో రేపో|| కడబూర స్వరము ధ్వనియించగా ప్రియుని స్వరము వినిపించగా వడివడిగ ప్రభు చెంతకు చేరెద ప్రియమార ప్రభుయేసుని గాంచెద ||నేడో రేపో|| నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు హల్లెలూయా స్తుతిగానాలతో నిత్యం ఆనందమానందమే ||నేడో రేపో||