నేనేమైనా ప్రభువా
Naenaemainaa Prabhuvaa
Lyricistశ్యామ్ వేదాల
UncategorizedAdded on 2/5/2017
Lyrics
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా|| లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా|| సర్వము పోయి శరీరము కుళ్ళిన నా అనువారే వెలివేసినా ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా|| నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది నాకెంతో మేలే ఇదిగో నేను ఉన్నానయ్యా దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||