నేనెల్లప్పుడు యెహోవా నిను
Naenellappudu Yehovaa Ninu
UncategorizedAdded on 6/27/2018
Lyrics
నిత్యము నా కీర్తి నా నోట నుండును (2) మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు|| కలిమి చేజారి నను వంచినా స్థితిని తలకిందులే చేసినా (2) రెండింతలుగా దయచేసెదవని (2) నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| పరుల ఎగతాళి శృతి మించినా కలవరము గుండెనే పిండినా (2) నా మొఱ విని కృప చూపెదవని (2) నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| శ్రమలు చెలరేగి బెదిరించినా ఎముకలకు చేటునే తెచ్చినా (2) ఆపదలలో విడిపించెదవని (2) నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||