నేనంటే నీకెందుకో
Naenmtae Neekemduko
Lyricistగుంటూరు రాజా
UncategorizedAdded on 1/8/2017
Lyrics
నేనంటే నీకెందుకో ఈ ప్రేమా నన్ను మరచి పొవెందుకు (2) నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకు కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా.. నా ప్రాణమా – (2) ||నేనంటే|| నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు (2) ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4) ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను ||నేనంటే|| ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2) ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4) ఏ బలమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను ||నేనంటే||