నేనంటే నీకు ఎంతిష్టమో
Naenmtae Neeku Emthishtamo
Lyricistకే వై రత్నం
UncategorizedAdded on 5/22/2018
Lyrics
నేనంటే నీకు ఎంతిష్టమో నా మంచి యేసయ్యా నా మీద నీకు ఎనలేని ప్రేమ ప్రతి క్షణము నీకే నా ఆరాధనా ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో మరి దేనిని ప్రేమించలేదు నాకిచ్చిన స్థానం పరమందున దూతలకు ఇవ్వలేదు ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి మదిలో నిలచిన మంచి దేవుడా (2) ||ఆరాధనా|| నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే క్రయ ధనముగా ఇచ్చి బంధింపబడిన నా బంధకాలు సిలువ యాగముతో తెంచి మరణించవలసిన నాకై నిత్య జీవం ప్రసాదించిన మంచి దేవుడా (2) ||ఆరాధనా||