నేను ఓడిపోనయా

Naenu Odiponayaa

Lyricistమార్క్ పీటర్
UncategorizedAdded on 11/12/2022

Lyrics

నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా –
నేను ఓడిపోనయా – నా పక్షానుండగా
నేను కృంగిపోనయా – నీవు నా తోడుండగా
నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా
నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా
(2)         ||నేను ఓడిపోనయా||
అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే
వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే
ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే
||నేను ఓడిపోనయా||
నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే
నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే
||నేను ఓడిపోనయా||
నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే
నన్ను దూషించిన చోటే దీవించినావే
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే
||నేను ఓడిపోనయా||

Video