నేను తగ్గాలి యేసు

Naenu Thaggaali Yaesu

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 6/11/2017

Lyrics

నేను తగ్గాలి యేసు – నీవే హెచ్చాలి
నేను పూర్తిగా మరుగై – నీవే కనబడాలి
ఇదియే నా ప్రార్థన – నీ చిత్తము
నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి
నా స్వార్ధ్య జీవితమంతా లయమైపోవాలి
యేసూ నీ స్వభావము నాలో అధికమౌతు ఉండాలి
పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి
(2)      ||ఇదియే||
ఆదాము పాపము నాలో వసియించియుండగా
యేసూ నీ రక్తమే దాని నశియింప చేయును
ఆటంకమేమియు లేక జీవధారలుండాలి
యేసూ నీ జీవము నాలో నింపబడుతు పోవాలి
(2)      ||ఇదియే||

Video