నేను వెళ్ళే మార్గము

Naenu Vellae Maargamu

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 9/27/2016

Lyrics

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను
(2)     ||నేను||
కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున
గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌
జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌
విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు
సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌

Video