నేనునూ నా ఇంటి వారును
Naenunoo Naa Imti Vaarunu
UncategorizedAdded on 2/1/2017
Lyrics
యెహోవాను సేవించెదము ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని ||నేనునూ|| శ్రమలో శోధనలో మరణ బంధకంలో శాంతి సమాధానం దయచేసి దేవుడు ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2) ||నేనునూ|| ఏ పాపము నన్ను ఏలనీయని వాడు ఏ అపాయమును రాకుండా కాపాడును కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2) ||నేనునూ|| దీర్ఘాయువు చేత దీవించు దేవుడు దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును (2) ||నేనునూ||