నజరేయుడా నా యేసయ్య

Najaraeyudaa Naa Yaesayya

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 2/1/2015

Lyrics

నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద
||నజరేయుడా||
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య
నీకే వందనం నీకే వందనం
||నజరేయుడా||
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా
నీకే వందనం నీకే వందనం
||నజరేయుడా||
సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా
నీకే వందనం నీకే వందనం
||నజరేయుడా||

Video