నలుగకుండ గోధుమలు

Nalugakumda Godhumalu

Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 8/3/2017

Lyrics

నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా
కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా
ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా
ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా
(2)       ||నలుగకుండ||
పగలని బండనుండి జలములు హోరులు
విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా
పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా
విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా
(2)       ||నలుగకుండ||
రక్తము చిందకుండ పాపములు పోవునా
కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా
అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా
ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా
బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా
||నలుగకుండ||

Video