నమ్మదగిన దేవుడవు
Nammadagina Daevudavu
Lyricistశ్రీనివాస్ బండారు
UncategorizedAdded on 2/23/2022
Lyrics
నమ్మదగిన దేవుడవు యేసయ్యా నిత్య జీవమిచ్చు దేవుడవు నీవయ్యా నా తేజోమయుడా నాదు రక్షకా నను విడిపించిన నా విమోచకా నీ శరణు జొచ్చితి ఆదరించుము సేదదీర్చి నీ అక్కున చేర్చుము యేసయ్యా… సేదదీర్చి నీ అక్కున చేర్చుము ||నమ్మదగిన|| నా ప్రాణము దప్పిగొని ఆశపడెనే నీ కృపా వార్తను వినిపించుము నా పూర్ణ హృదయముతో ఆత్మతో కృతజ్ణతా స్తుతులు చెల్లించెదన్ (2) ||నీ శరణు|| నా ప్రాణము ఆపదలో చిక్కుబడెనే నను రక్షించుటకై చేయి చాచితివే పదితంతుల సితారతో గానముతో స్తుతి గానం చేసి కీర్తించెదన్ (2) ||నీ శరణు||