నమ్మకమైన దేవుడవైన

Nammakamaina Daevudavaina

Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 8/2/2017

Lyrics

నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా
ఇంకేమి కోరుకోనయ్యా
(2)        ||నమ్మకమైన||
ఆప్తులైన వారే హాని చేయచూసినా
మిత్రులే నిలువకుండినా
న్యాయము తీర్చే నీవు నాకుంటే
చాలు యేసయ్యా
(2)        ||నమ్మకమైన||
జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
నష్టమే మిగులుచుండినా
శాపము బాపే నీవు నాకుంటే
చాలు యేసయ్యా
(2)        ||నమ్మకమైన||
కష్ట కాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా
సాయము చేసే నీవు నాకుంటే
చాలు యేసయ్యా
(2)        ||నమ్మకమైన||

Video