నమ్మకమైన నా ప్రభు
Nammakamaina Naa Prabhu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/3/2016
Lyrics
నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును || నమ్మకమైన || కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడిన స్థిరపరచి కాపాడిన స్థిరపరచిన నా ప్రభున్ పొగడి నే స్తుతింతును (2) || నమ్మకమైన || ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు మన్ననతోడ నీ దరిన్ చేర్చి నన్ క్షమించితివి (2) || నమ్మకమైన || కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి భంగ పర్చు సైతానున్ గెల్చి విజయమిచ్చితివి (2) || నమ్మకమైన || నా కాశ్రయశైలమై – కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి ప్రాకారంపు ఇంటివై నన్ను దాచియుంటివి (2) || నమ్మకమైన || సత్య సాక్షివై యుండి – నమ్మదగినవాడవై నమ్మదగినవాడవై నిత్యుడౌ మా దేవుడా ఆమేనంచు పాడెద (2) || నమ్మకమైన ||