నమ్మకమైన నా స్నేహితుడు
Nammakamaina Naa Snaehithudu
Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 2/4/2015
Lyrics
నమ్మకమైన నా స్నేహితుడు నా ప్రభు యేసుడు ఎడబాయనివాడు విడువనివాడు నిన్న నేడు ఒకటిగనున్నవాడు ||నమ్మకమైన|| ఆపదలో ఆనందములో నను వీడనివాడు వ్యాధిలో భాధలో నను స్వస్థపరచువాడు అనుక్షణం నా ప్రక్కన నిలచి ప్రతిక్షణం నా ప్రాణం కాచి అన్నివేళలా నన్నాదరించువాడు నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు ||నమ్మకమైన|| కలిమిలో లేమిలో నను కరుణించువాడు కలతలలో కన్నీళ్ళలో నను ఓదార్చువాడు కన్నతల్లిని మించిన ప్రేమతో అరచేతిలో నను దాచినవాడు ఎన్నడు నన్ను మరువనివాడు నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు ||నమ్మకమైన||