నమ్మకు ఇలలో

Nammaku Ilalo

Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 6/9/2018

Lyrics

నమ్మకు ఇలలో ఎవరిని
సాయం చేస్తారనుకొని
నమ్ముకో రక్షకుడేసుని
కార్యం చూడు నిలుచొని
(2)        ||నమ్మకు||
సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు
చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు
అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు
శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు
(2)        ||నమ్మకు||
నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే
మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే
నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు
దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు
(2)        ||నమ్మకు||
నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి
జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి
సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు
రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు
(2)        ||నమ్మకు||

Video