నమ్మకురా నమ్మకురా
Nammakuraa Nammakuraa
UncategorizedAdded on 2/12/2017
Lyrics
నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురా ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా ||నమ్మకురా|| ధనము చదువు నేర్పునురా – సంస్కారం నేర్పదురా ధనము మందులు కొనునురా – ఆరోగ్యం ఇవ్వదురా వస్తువాహనాల కాధారం సుఖ సంతోషాలకు బహుదూరం (2) ||నమ్మకురా|| ధనము పెళ్ళి చేయునురా – కాపురము కట్టదురా ధనము సమాధి కట్టునురా – పరలోకం చేర్చదురా డబ్బును నమ్మకురా గబ్బు పనులు చేయకురా (2) ||నమ్మకురా|| ధనము ఆస్తిని పెంచునురా – అనురాగం తుంచునురా ధనము పొగరు పెంచునురా – పరువు కాస్త తీయునురా ధనము కోరిక తీర్చునురా నరకానికి చేర్చునురా (2) ||నమ్మకురా||