నన్నెంతగానో ప్రేమించెను

Nannemthagaano Praemimchenu

Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 1/19/2016

Lyrics

నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము – నా శాపము
తొలగించెను నను కరుణించెను
(2)     ||నన్నెంత||
సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో
పడనీయక దరి చేరనీయక
తన కృపలో నిరతంబు నను నిల్పెను
(2)          ||నన్నెంత||
సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము
నేర్పించెను నాకు చూపించెను
వర్ణింపగా లేను ఆ ప్రభువును
(2)          ||నన్నెంత||
కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును
నా కోసమే యేసు శ్రమ పొందెను
నా పాపమంతటిని క్షమియించెను
(2)          ||నన్నెంత||
ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు
ఏమిత్తును నేనేమిత్తును
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును
(2)          ||నన్నెంత||

Video