నన్నెంతగానో ప్రేమించిన
Nannemthagaano Praemimchina
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 9/11/2015
Lyrics
నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా నా దీన బ్రతుకునే దీవించిన దేవా నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును నా యవ్వనమంతా… నా జీవితమంతా ||నన్నెంతగానో|| ధరలోని మన్నుతో సమమైన నన్ను ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు అన్నీ నీవే నాకై సమకూర్చినావు ఉన్నాను నీ తోడు భయపడకన్నావు వాక్యపు మన్నాతో పోషించిన నన్నే ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే ||నిన్నే|| దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో మరణపు విల్లును విరచిన దేవా నీలో ||నీలో||