నన్ను గన్నయ్య రావె
Nannu Gannayya Raave
Lyricistపురుషోత్తము చౌదరి
UncategorizedAdded on 9/22/2017
Lyrics
నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొందికగా జేయరావే నా డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను|| హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి మొద్దులతో నింక కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| కాలము పెక్కు గతించెను గర్వాదు లెడదెగవాయెను ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| దారుణ సంసార వారధి దరి జూపి ప్రోవ నీ కన్నను కారణ గురువు లింకెవ్వరు లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను|| నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని దీవించి రక్షింపనిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||