నన్ను కావగ వచ్చిన

Nannu Kaavaga Vachchina

UncategorizedAdded on 3/12/2017

Lyrics

నేను పాపము చేసినా చూపావు నీ దయా
నన్ను ఎన్నడూ విడిచిపోకుమయ్యా
సిలువ నీడలో నన్ను దాచుమయ్యా
లోకమంతా నన్ను దోషిగ చూసినా
ప్రేమతోనే నన్ను చేరదీసిన
||నన్ను||
నిన్ను విడచి దూరమైనా ధూళి నేనే యేసయ్యా
లోకాశలకు లోబడిన లోభిని నేనేనయ్యా
అందరు నన్ను అనాథ చేసి పోయినా
అంధకారమే నాకు బంధువై మిగిలినా
నా మదిలో మెదిలిన మోము నీదే నా యేసయ్యా
||నన్ను||
నీ చరణములు చేరగానే నా గతి మారేనయ్యా
నీ శరణము వేడగానే నీది నాదిగా మారెనే
ఏ యోగ్యత నాకు లేకపోయినా
నీ వారసునిగా నన్ను ఎంచిన
ఇది ఊహకందని చిత్రమైన ప్రేమ నీదయ్యా
||నన్ను||

Video