నన్ను నీవలె నిర్మించినను

Nannu Neevale Nirmimchinanu

Lyricistదీవెనయ్య
UncategorizedAdded on 6/18/2019

Lyrics

నన్ను నీవలె నిర్మించినను
కోల్పోతి దేవా నీ రూపమును
హేయ క్రియలతో సిలువేసినను
నాపై నీ కృపను తొలగించవెందుకు
నిను బాధించినా భరియించితివా
నా పాపం జ్ఞాపకమే రాలేదా
(2) ||నన్ను నీవలె||
ఎరిగి ఎరిగి చెడిపోతిని
తెలిసి తెలివిగా తప్పిపోతిని
బ్రతికున్న శవమునై నేనుంటిని
అహము ముదిరి పది లేవలేకపోతిని
(2) ||నన్ను నీవలె||
భయభక్తులు లేని వెర్రివాడనై
కుంపటి ఒడిలో పెట్టుకుంటిని
ఒక పూటకూటికై ఆశపడితిని
వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని
(2) ||నన్ను నీవలె||
సిల్వలో నీ శ్రమ చూడకుంటిని
కల్వరి ప్రేమను కానకుంటిని
నిన్ను సిలువ వేయమని కేకలేసితి
అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా
(2) ||నన్ను నీవలె||

Video