నన్ను పిలచిన దేవా

Nannu Pilachina Daevaa

Lyricistబెన్ని జాషువా
UncategorizedAdded on 5/24/2021

Lyrics

నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా
నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప
హెచ్చించునది నీ కృప మాత్రమే
నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును
నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా
యేసయ్యా …
ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు
తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు
బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను
||నీ కృపయే||
నేనని చెప్పుటకు నాకేమి లేదు
సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు
అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను
||నీ కృపయే||

Video