నశియించెడి లోకంలో
Nashiyimchedi Lokmlo
Lyricistజాన్ వెస్లీ
UncategorizedAdded on 3/1/2017
Lyrics
నశియించెడి లోకంలో – వసియించవు కలకాలం మేలైనది చేపట్టి – సాగించు నీ పయనం – అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూ పరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా ||నశియించెడి|| కాలంతో పాటుగా కృశియించును శరీరం మరణం కబళించును ఏ ఘడియలోనైనా క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి వసియించు కలకాలం – సత్యమైన లోకంలో ||నశియించెడి|| నిలచిపోవును మహిలోన బంధాలన్ని మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో ఇకనైనా తేరుకొని – గ్రహియించు సత్యాన్ని యేసులోకి మళ్ళించు – నీ జీవిత గమనాన్ని ||నశియించెడి||