నీ ఆనంద తైలముతో
Nee Aanmda Thailamutho
Lyricistఆడమ్ బెన్నీ
UncategorizedAdded on 2/27/2023
Lyrics
నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా తడిసెదను.. నీ జీవనదిలో తడిసి తడిసి ఆనందించెదా (2) ||నీ ఆనంద|| వీడిపోయెను నా పాప సంకెళ్లు నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ నే మరువగలనా నీ మంచి ప్రేమ (2) ||నీ ఆనంద|| నీ ఆత్మ నాకు తోడుండగా కానెన్నడు కాను ఒంటరిని ప్రేమా ప్రవాహం ఉంచావే నాలోన నే మరువగలనా నా హృదయములో (2) ||నీ ఆనంద|| నే దాటిపోదును దేశ సరిహద్దులు ప్రకాశించెద చీకటి లోకంలో జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా నన్ను వాడుకొనుమా నీ దివ్య సేవలో (2) ||నీ ఆనంద||