నీ అరచేతిలో చెక్కుకుంటివి

Nee Arachaethilo Chekkukumtivi

Lyricistశామ్యూల్ కర్మోజి
UncategorizedAdded on 1/5/2017

Lyrics

నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా
నీ నీడలో దాచుకుంటివి నను దేవా
నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను
నీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదను
నాకన్ని నేవే దేవా
నా బ్రతుకు నీకే ప్రభువా
దీపముగా నీ వాక్యాన్నిచ్చి
తిన్నని త్రోవలో నన్ను నడిపి
నాకు ముందుగా నీవే నడచి
జారిపడకుండా కాపాడితివి
కొండ తేనెతో నన్ను తృప్తి పరచి
అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి
ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి –
(2)         ||నాకన్ని||
ఆత్మ శక్తితో నన్ను అభిషేకించి
అంధకార శక్తులపై విజయాన్నిచ్చి
ఆశ్చర్య కార్యములెన్నో చేసి
శత్రువుల యెదుట భోజనమిచ్చి
ఎక్కలేని కొండలు ఎక్కించితివి
నా గిన్నె నిండి పార్ల చేసియితివి
నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి –
(2)         ||నాకన్ని||

Video